: నామా నాగేశ్వరరావును పరామర్శించిన చంద్రబాబు


టీటీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావును ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పరామర్శించారు. వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న నామా హైదరాబాదులోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు చంద్రబాబు స్వయంగా ఆసుపత్రికి వెళ్లి నామాను పరామర్శించారు. నామా ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడ నుంచి బయల్దేరి ఢిల్లీ వెళ్లారు.

  • Loading...

More Telugu News