: అతనికి చివరి క్షణాల్లో బాల్య స్నేహితుడే గుర్తొచ్చాడు!
గోమాంసం తిన్నాడనే నెపంతో ఉత్తరప్రదేశ్ లోని దాద్రీ గ్రామంలో మహ్మద్ ఇఖ్లాఖ్ అనే వ్యక్తిని కొంత మంది దారుణంగా హతమార్చిన సంగతి తెలిసిందే. గ్రామంలోని హిందువులంతా మూకుమ్మడిగా అతని ఇంటిపై దాడి చేయగానే, తన తప్పులేదని, సహాయం చేయాల్సిందిగా తన బాల్య స్నేహితుడు మనోజ్ సిసోడియాకు ఇఖ్లాఖ్ ఫోన్ చేశాడట. వెంటనే మనోజ్ సిసోడియా పోలీసులతో సహా సంఘటనాస్థలికి చేరుకున్నాడు. అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. బాల్య స్నేహితుడ్ని రక్తపు మడుగులో చూసిన సిసోడియా తీవ్రంగా కలత చెందాడు. కాగా, ఈ ఘటనకు కారణం బీజేపీ నేత సంజయ్ రాణా కుమారుడు విశాల్ రాణా, అతని స్నేహితులు, మరి కొందరు గ్రామస్థులని దర్యాప్తులో తేలిన సంగతి తెలిసిందే.