: రఘువీరా కాన్వాయ్ పై చెప్పులు, రాళ్లు విసిరిన టీడీపీ కార్యకర్తలు


ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి కాన్వాయ్ పై టీడీపీ కార్యకర్తలు చెప్పులు, రాళ్లు విసిరారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా కుప్పంలో చోటుచేసుకుంది. కుప్పంలో విమానాశ్రయం ప్రతిపాదిత స్థలంలో రఘువీరా ఈరోజు పర్యటించారు. విమానాశ్రయం నిర్మాణంపై స్థానికుల నుంచి అభ్యంతరం వ్యక్తమవుతుండటంతో ఆయన వారిని కలిశారు. రఘువీరా అక్కడికి రావడాన్ని టీడీపీ కార్యకర్తలు నిరసిస్తూ ఈ చర్యలకు పాల్పడ్డారు. దీంతో కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. రెండు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ పెరగకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఒక ఎస్ఐ కు గాయాలయ్యాయి. కాగా,కుప్పంలో సభ నిర్వహించాలనుకున్న కాంగ్రెస్ నాయకులకు పోలీసులు అభ్యంతరం తెలిపారు. సభకు హాజరయ్యేందుకు వెళుతున్న సుమారు 70 మంది కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News