: భారతీయులకు 1100 ఏళ్ల నాటి అపురూప కానుకను ఇచ్చిన ఏంజెలా మెర్కెల్


అది దాదాపు 1100 సంవత్సరాల క్రితం నాటి అత్యంత పురాతన మహిషాసుర మర్దిని విగ్రహం. జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి చెందిన ఈ విగ్రహం ఎన్నో చేతులు దాటి జర్మనీకి చేరింది. ఇప్పుడా విగ్రహాన్ని భారత పర్యటనకు వస్తున్న సందర్భంగా చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ తన వెంట తీసుకువచ్చారు. నేడు మోదీతో చర్చల అనంతరం, హైదరాబాద్ హౌస్ లో జరిగిన సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడుతున్న వేళ, దాన్ని భారత్ కు కానుకగా ఇస్తున్నట్టు మెర్కెల్ తెలిపారు. స్వయంగా మోదీకి అందించారు. ఆనందంతో ఆ విగ్రహాన్ని స్వీకరించిన మోదీ, ట్విట్టర్ ఖాతా ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ఈ విగ్రహం ప్రతీకని అభివర్ణించారు. భారతీయులకు జర్మనీ వాసులు అందించిన అపురూప కానుకని తెలిపారు.

  • Loading...

More Telugu News