: జగన్ ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్నారు: గంటా
వైఎస్సార్సీపీ అధినేత ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్నారని మంత్రి గంటా శ్రీనివాసరావు మండిపడ్డారు. విశాఖపట్టణంలో ఆయన మాట్లాడుతూ, విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం అవసరమని స్పష్టం చేశారు. రైతులకు జగన్ అన్యాయం చేయడం సరికాదని ఆయన హితవు పలికారు. రాష్ట్రాభివృద్ధికి సహకరించకుండా, అడ్డుపడడం సరికాదని జగన్ కు ఆయన సూచించారు. ప్రజలను రెచ్చగొట్టడం సరైన పధ్ధతి కాదని ఆయన తెలిపారు. కాగా, జగన్ ప్రస్తుతం భోగాపురం విమానాశ్రయ పరిధిలోని గ్రామాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.