: ఆంధ్రాబ్యాంకులో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ చోరుడు


బ్యాంకుకు కన్నమేసి డబ్బు దొంగిలించాలనుకున్న ఓ దొంగగారి ప్రయత్నం ఆరంభంలోనే బెడిసికొట్టింది. దాంతో సదరు దొంగ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. ఆ వివరాల్లోకి వెళితే, గతరాత్రి రంగారెడ్డి జిల్లా మొమిన్ పేట ఆంధ్రాబ్యాంకులో కిటికీలు తొలగించి ఓ దొంగ చొరబడ్డాడు. అనంతరం బ్యాంకులో తాళాలు పగులగొట్టేందుకు ప్రయత్నించాడు. అర్ధరాత్రి బ్యాంకు లోపలి నుంచి శబ్దాలు వినపడడంతో బ్యాంకుపై నివాసముండే భవన యజమాని పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు. దీంతో, రంగప్రవేశం చేసిన పోలీసులు, దొంగను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని కటకటాల వెనుకకు తోసేశారు. దొంగను అదే మండలంలోని గోవిందాపుర్ కు చెందిన ఊరడి రవి (35)గా గుర్తించారు.

  • Loading...

More Telugu News