: అగ్రిగోల్డ్ వ్యవహారంపై రేపు ఉత్తర్వులు వెల్లడించనున్న హైకోర్టు


డిపాజిటర్లను మోసం చేసిన అగ్రిగోల్డ్ కేసు విషయంలో ఉమ్మడి హైకోర్టు ఈ రోజు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ వ్యవహారంలో అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తుల విక్రయానికి రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలో తెలంగాణ, ఏపీ నుంచి ఒక్కొక్క సభ్యులుంటారని చెప్పింది. ఇదే సమయంలో కమిటీలో స్థానం కోసం ఏపీ ప్రభుత్వం ఏడుగురి పేర్లతో కూడిన జాబితాను కోర్టుకు సమర్పించింది. ఇక తెలంగాణ నుంచి సభ్యుడి కోసం ఐదు పేర్లతో కూడిన జాబితాను సమర్పించాలని టి.ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే డిపాజిటర్ల నుంచి కూడా సభ్యుడు ఉండాలని పిటిషన్ దారు కోరగా, డిపాజిటర్ల ప్రయోజనాలు తప్పకుండా కాపాడతామని కోర్టు స్పష్టం చేసింది. విచారణ సమయంలో కోర్టు ఎదుట ఏపీ సీఐడీ చీఫ్ ద్వారకా తిరుమలరావు, అగ్రిగోల్డ్ ఛైర్మన్ వెంకట్రావు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News