: వెలుగుల తెలంగాణగా తీర్చిదిద్దేందుకు కేసీఆర్ కృషి: శ్రీనివాస్ గౌడ్


త్వరలోనే తెలంగాణ రాష్ట్రం విద్యుత్ మిగులు కలిగిన రాష్ట్రంగా అవతరిస్తుందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. టీఎస్ అసెంబ్లీలో విద్యుత్ పై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణను వెలుగుల తెలంగాణగా మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. పాత విద్యుత్ లైన్లను ఆధునికీకరించే విషయమై ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదనలు పంపామని అన్నారు. విద్యుత్ సమస్యను పరిష్కరించే నిమిత్తం... తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నిధులను సమకూర్చాలని విన్నవించారు. గత ప్రభుత్వాలు కమిషన్లకు కక్కుర్తి పడి నాసిరకం పనులు చేశాయని ఆరోపించారు.

  • Loading...

More Telugu News