: రాజ్ భవన్ వద్ద ఆటోడ్రైవర్ హల్ చల్ !
రాజ్ భవన్ వద్ద ఒక ఆటో డ్రైవర్ హల్ చల్ చేశాడు. తప్పతాగి రోడ్డుమీద వెళ్లే వారిని దుర్భాషలాడాడు. ఆటోడ్రైవర్ కరుణాకర్ ముగ్గురు యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. వారిని నానా తిట్లు తిట్టినట్లు సమాచారం. దీంతో స్థానికులు జోక్యం చేసుకుని సదరు ఆటో డ్రైవర్ ను పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు. ఆటోకు సంబంధించిన కాగితాలు, డ్రైవర్ లైసెన్స్ తదితర వివరాలన్నింటిని కరుణాకర్ నుంచి రాబట్టారు. కాగా, మద్యం మత్తులో ఉన్న ఆటోడ్రైవర్ తన ఇష్టమొచ్చినట్లు మాట్లాడాడని, ముఖ్యంగా ముగ్గురు యువతులతో అతను ప్రవర్తించిన తీరు చాలా ఇబ్బందికరంగా ఉందని స్థానికులు చెప్పారు.