: పొత్తు లేకుండానే బీహార్ బరిలోకి... మా అభ్యర్థులు వీరే: ఎంఐఎం
త్వరలో బీహార్ లో మొదలుకానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడుతున్న ఎంఐఎం పార్టీ అభ్యర్థులను అసదుద్దీన్ ఒవైసీ ఈ ఉదయం ప్రకటించారు. తొలి విడతలో ఎన్నికలు జరిగే సీమాంచల్ ప్రాంతం నుంచి బరిలోకి దిగే ఆరుగురి పేర్లను ఆయన తెలిపారు. కోచదామన్ నుంచి అక్తర్ ఉల్ ఇమాన్, కిషన్ గంజ్ నుంచి తసీరుద్దీన్, రాణిగంజ్ నుంచి డాక్టర్ అమిత్ పాశ్వాన్, బైసి నుంచి గులామ్ సర్వార్, అమోర్ నుంచి నవాజిష్ ఆలం, బలరామ్ పూర్ నుంచి ఎండీ ఆదిల్ పోటీ చేస్తారని వివరించారు. బీహార్ లోని 40 స్థానాల నుంచి ఎవరితోనూ పొత్తు లేకుండా పోటీ పడతామని, తాము మెజారిటీ స్థానాలు గెలిస్తే ఆర్టికల్ 371 ప్రకారం సీమాంచల్ ప్రాంతీయ అభివృద్ధి బోర్డు ఏర్పాటుకు మార్గం సుగమమవుతుందని ఆయన వివరించారు. కాగా, ముస్లింల జనాభా అధికంగా ఉన్న సీమాంచల్ ప్రాంతంలో పోటీ పడి అక్కడ కూడా సత్తా చాటాలని ఎంఐఎం భావిస్తోంది.