: సోమ్ నాథ్ భారతికి బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు


మాజీ మంత్రి, ఆప్ ఎమ్మెల్యే సోమ్ నాథ్ భారతికి సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన పెట్టుకున్న పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. ఈ విషయంలో ట్రయల్ కోర్టును ఆశ్రయించాలంటూ సూచించింది. గృహ హింస, హత్యాయత్నం అరోపణలతో సోమ్ నాథ్ భారతిపై కేసు నమోదైన తర్వాత, పోలీసులకు చిక్కకుండా ఆయన తప్పించుకు తిరిగారు. ఈ క్రమంలో, వెంటనే లొంగిపోవాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించిన తర్వాతనే, ఆయన పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ నేపథ్యంలోనే, బెయిల్ కోసం ఆయన సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

  • Loading...

More Telugu News