: రేపు తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చిన టి.టీడీపీ
రేపు తెలంగాణ బంద్ కు ఆ రాష్ట్ర టీడీపీ పిలుపునిచ్చింది. రైతు సమస్యలపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ బంద్ కు పిలుపునిచ్చినట్టు టి.టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రభుత్వ దిష్టి బొమ్మలను దహనం చేసి సర్కార్ కు నిరసన తెలుపుతామని చెప్పారు. శాసనసభ నుంచి విపక్ష సభ్యులందరినీ సస్పెండ్ చేసిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు