: టి.శాసనమండలిలో కూడా విపక్షాల ఆందోళన... ఆరుగురు సభ్యుల సస్పెన్షన్
తెలంగాణ శాసనమండలిలో కూడా విపక్ష సభ్యుల సస్పెన్షన్ జరిగింది. రైతుల రుణాలను ప్రభుత్వం తక్షణమే మాఫీ చేయాలని విపక్షాలు ఆందోళన చేశాయి. కాంగ్రెస్, బీజేపీ సభ్యులు ప్లకార్డులు పట్టుకుని మండలి ఛైర్మన్ పోడియాన్ని చుట్టుముట్టి తీవ్ర నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఐదుగురు కాంగ్రెస్, ఒక బీజేపీ సభ్యుడిని ఒక రోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్టు ఛైర్మన్ స్వామిగౌడ్ ప్రకటించారు. సస్పెండ్ అయిన వారిలో కాంగ్రెస్ నుంచి షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఎంఎస్ ప్రభాకర్, ఫరూక్ హుస్సేన్, లలిత, బీజేపీ సభ్యుడు రామచంద్రరావు వున్నారు.