: బీజేపీ వైపు అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ ఆఖరి సీఎం అడుగులు!


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్న మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అతి త్వరలోనే బీజేపీలో చేరనున్నారని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఇప్పటికే కిరణ్ సోదరుడు బీజేపీలో చేరనున్నారని వార్తలు వస్తుండగా, ఇప్పుడు సోదరులిద్దరూ బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్టు తెలుస్తోంది. బీజేపీతో ఉంటే తమ రాజకీయ భవిష్యత్తు బాగుంటుందని కిరణ్ కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం దాన్ని వ్యతిరేకిస్తూ, కాంగ్రెస్ పార్టీకి కిరణ్ కుమార్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆపై 'జై సమైక్యాంధ్ర' పేరిట పార్టీ పెట్టి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన నల్లారి టీమ్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.

  • Loading...

More Telugu News