: రఘువీరాకు షాకిచ్చిన ఏపీ పోలీస్...‘కపోత’ తారాజువ్వలపై కేసు నమోదు


ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డికి ఏపీ పోలీసులు షాకిచ్చారు. పశ్చిమగోదావరి జిల్లాలో మొన్నటి రఘువీరా పర్యటనలో భాగంగా పార్టీ కార్యకర్తలు ఆయన సమక్షంలోనే తారాజువ్వలకు పావురాలను కట్టి ప్రయోగించిన సంగతి తెలిసిందే. తన కళ్లెదుటే పార్టీ కార్యకర్తలు పావురాలను తారాజువ్వల్లో కూరుతున్నా, రఘువీరా వారిని ఆపలేదు. మీడియా కంటికి చిక్కిన ఈ దృశ్యాలు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చకే తెరతీశాయి. ఈ ఘటనను సీరియస్ గా పరిగణించిన పోలీసులు పశ్చిమగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రబీ ఉల్లా బేగ్ తో పాటు తారాజువ్వల తయారీదారుడు బాబుపై కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News