: ఢిల్లీ బయలుదేరిన చంద్రబాబు... రోజంతా కేంద్రం పెద్దలతో వరుస భేటీలు


టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కొద్దిసేపటి క్రితం ఢిల్లీ బయలుదేరారు. హైదరాబాదు శివారులోని శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన చంద్రబాబు మరికాసేపట్లో ఢిల్లీ చేరుకోనున్నారు. సాగరమాలపై ఢిల్లీలో జరగనున్న కీలక సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళుతున్న చంద్రబాబు నేటి రాత్రి దాకా బిజీబిజీగా గడపనున్నారు. సాగర మాల సమావేశం అనంతరం ఏపీలో జలమార్గాల అభివృద్ధికి సంబంధించి ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ అథారిటీ చైర్మన్ అమితాబ్ వర్మతో చంద్రబాబు భేటీ కానున్నారు. ఈ భేటీ తర్వాత చంద్రబాబు నేరుగా ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అవుతారు. ఇక పలువురు కేంద్ర మంత్రులతోనూ ఆయన భేటీ అవుతారని సమాచారం.

  • Loading...

More Telugu News