: రిక్షావాలాగా సానియా మీర్జా... హింగిస్ ను రిక్షాలో ఎక్కించుకుని బీజింగ్ లో చక్కర్లు
అదేంటీ, టెన్నిస్ రాకెట్ పట్టాల్సిన సానియా మీర్జా రిక్షావాలాగా ఎప్పుడు మారిందనుకుంటున్నారా? అయినా, కెరీర్ లో అత్యుత్తమంగా రాణిస్తున్న సమయంలో సానియా రిక్షావాలాగా మారాల్సిన అవసరం ఏముందనుకుంటున్నారా? అయినా, షోయబ్ మాలిక్ ఉండగా, సానియా ఎందుకు రిక్షా తొక్కుతుందనేగా మీ డౌటు? అన్ని డౌట్లు ఎందుకు గాని, సానియా మీర్జా నిజంగా ఏమీ రిక్షావాలాగా మారలేదులెండి. చైనా ఓపెన్ కోసం ప్రస్తుతం బీజింగ్ లో ఉన్న సానియా, డబుల్స్ లో తన సహచరి మార్టినా హింగిస్ తో కలిసి నిన్న సరదాగా గడిపింది. హింగిస్ ను రిక్షాలో ఎక్కించుకుని తాను రిక్షా తొక్కుతున్నట్లు ఓ ఫొటో తీసుకుని ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. హింగిస్ కు ‘డే ఆఫ్’ అయితే తనకు మాత్రం ‘వర్కింగ్ డే’ అంటూ సదరు పోస్ట్ కు ఆమె సరదా కామెంట్ జోడించింది.