: అమెరికాలో కల్వకుంట్ల కవిత...బతుకమ్మ పాటతో ఆకట్టుకున్న వైనం!


తెలంగాణ సంప్రదాయ పండుగ బతుకమ్మను విశ్వవ్యాప్తం చేసిన ఘనత తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు, నిజామాబాదు ఎంపీ కల్వకుంట్ల కవితకే దక్కుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం జరుగుతున్న సమయంలో తెలంగాణ జాగృతి సంస్థ పేరిట రంగప్రవేశం చేసిన కవిత, ఆ పండుగను సరికొత్త రీతిలో విస్తృతం చేశారు. ఈ కార్యక్రమాలకు భారీ స్పందన రావడంతో ఆమె విదేశాల్లోని తెలంగాణ ప్రజల వద్దకూ వెళ్లారు. తద్వారా తెలంగాణ సంప్రదాయ పండుగ విశ్వవ్యాప్తమైంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్, ఈ పండుగను అధికారికంగా నిర్వహించారు. పండుగ నిర్వహణ కోసం ఏకంగా రూ.10 కోట్లు విడుదల చేశారు. తాజాగా ఈ ఏడాది కూడా ఈ పండుగ కోసం ప్రభుత్వం రూ.10 కోట్లను విడుదల చేసింది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది కూడా ఈ పండుగ వేడుకలా జరగనుంది. ఇక నిన్న అమెరికా వెళ్లిన కవితకు అక్కడి తెలంగాణ వాసుల నుంచి రెడ్ కార్పెట్ స్వాగతం లభించింది. అక్కడి మహిళలతో కలిసి ఆమె బతుకమ్మ ఆట ఆడారు. ఈ సందర్భంగా ఆమె పాడిన బతుకమ్మ పాటకు మంచి స్పందన లభించింది. స్వయంగా కవిత బతుకమ్మ పాట పాడటంతో అక్కడి మహిళలు ఉత్సాహంగా బతుకమ్మ ఆట ఆడారు.

  • Loading...

More Telugu News