: కోటప్పకొండలో వేదపాఠశాల ప్రారంభం
కోటప్పకొండ అభివృద్ధికి ఎన్ని నిధులైనా కేటాయిస్తామని, వచ్చే ఏడాది నాటికి ఈ వేదపాఠశాలలో వంద మంది విద్యార్థులు ఉండేలా చూడాలని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి అన్నారు. గుంటూరు జిల్లా కోటప్పకొండపై నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీవెంకటేశ్వర వేద పాఠశాలను ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తోందన్నారు. అంతకుముందు కొండ దిగువన నిర్మాణంలో ఉన్న వేద పాఠశాల భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మంత్రి అచ్చెన్నాయుడు కూడా పాల్గొన్నారు.