: స్పృహలోకి వచ్చిన ఇంద్రాణి ముఖర్జియా


షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు, ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా స్పృహలోకి వచ్చింది. ఆమె ప్రాణానికి ఎలాంటి ముప్పులేదని వైద్యులు ధ్రువీకరించారు. ఎంఆర్ఐ స్కాన్ తీసినప్పుడు ఆమె కొన్ని మాత్రలు వేసుకున్నట్లు తేలింది. ప్రస్తుతం వెంటిలేటర్ ద్వారా ఆమెకు చికిత్స అందించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ, ఇంద్రాణి ఫిట్స్ నిరోధానికి వైద్యం చేయించుకుంటున్నారని, ఆ మాత్రలను ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి వేసుకోవాలని కానీ, ఆ మాత్రలను అధిక మోతాదులో ఇంద్రాణి వాడటం వల్లే అపస్మారక స్థితిలోకి వెళ్లారని అన్నారు.

  • Loading...

More Telugu News