: వరంగల్ జిల్లాలో మరో పత్తిరైతు ఆత్మహత్య


అప్పుల బాధ పడలేక తెలంగాణ రాష్ట్రంలో మరో పత్తి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం సీతారాంపూర్ లో చోటుచేసుకుంది. చెల్పూరి రాజయ్య అనే పత్తిరైతు ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పంట సాగు కోసం రాజయ్య అప్పులు చేశాడు. ఆ అప్పులు తీర్చే దారి లేకపోవడంతో అతను పురుగుమందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, రాజయ్య కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

  • Loading...

More Telugu News