: సెల్ఫీ ముచ్చట...తండ్రీకొడుల మృతి!
అన్నదమ్ములిద్దరూ సెల్ఫీ దిగబోయి కాలువలో పడ్డారు. వారిని రక్షించబోయిన తండ్రి కాలువలోకి దూకాడు. ఈ క్రమంలో సోదరులలో ఒకరు బయటపడగా తండ్రీకొడుకులు మృతి చెందిన విషాద సంఘటన మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో జరిగింది. అభిదూబే (10), సోదరుడు ఆమన్ తో కలిసి ఒక కాలువ వద్ద సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో వాళ్లిద్దరూ కాలు జారి కాలువలో పడిపోయారు. అక్కడే ఉన్న పిల్లల తండ్రి సంజయ్(42) వారిని రక్షించేందుకని కాలువలోకి దూకాడు. అయితే.. సంజయ్, అభిలిద్దరూ మృతి చెందారు. సోదరులలో మరొకరు ఆమన్ ను అక్కడే ఉన్న ఒక యువకుడు రక్షించినట్లు సమాచారం.