: 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' సినిమా విజయయాత్రలో అపశృతి... అభిమాని కాలుపై నుంచి వెళ్లిన కారు!
'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' చిత్రం విజయయాత్రలో అపశృతి దొర్లింది. ఈ చిత్ర బృందంలోని కారు ఒక అభిమాని కాలుపై నుంచి వెళ్లడంతో అతని కాలు విరిగింది. ఈ సంఘటన కాకినాడలోని చాణక్య చంద్రగుప్త థియేటర్ వద్ద చోటుచేసుకుంది. ఈ థియేటర్ వద్దకు ఈ రోజు ఈ చిత్ర బృందం వచ్చింది. అక్కడే నిలబడి ఉన్న ఓ అభిమాని కాలుపై బృందంలోని వారి కారు వెళ్లడంతో అతనికి తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే ఆసుపత్రికి తరలించగా, అతని కాలు విరిగినట్టు వైద్యులు చెప్పారు. కాగా, ఈ చిత్రం హీరో సాయిథరమ్ తేజ్, డైరక్టర్ హరీష్ శంకర్ తదితరులు ఈ విజయయాత్రలో పాల్గొన్నారు.