: అమరావతి చిహ్నం రూపకల్పనపై సమాలోచనలు
అమరావతి చిహ్నం రూపకల్పనపై ఏపీ ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. పలు విశ్వవిద్యాలయాల ఆచార్యులతో పురపారలకశాఖ మంత్రి నారాయణ ఆదివారం సమావేశమయ్యారు. సీఆర్డీఏ కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి నాగార్జున, శ్రీవెంకటేశ్వర, శ్రీకృష్ణ దేవరాయ యూనివర్శిటీల నుంచి సుమారు 30 మంది ఆచార్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అమరావతి చిహ్నం రూపకల్పనపై వారితో మంత్రి చర్చించారు. సంస్కృతీసంప్రదాయాలను ప్రతిబింబించేలా చేపట్టనున్న రాజధాని నిర్మాణం కోసం డిజైన్ల రూపకల్పనతో పాటు పలు విషయాలను మంత్రి నారాయణ ఆచార్యులతో ప్రస్తావించినట్లు సమాచారం.