: ప్రజలను మోసగిస్తున్న జగన్ కు దీక్ష చేసే అర్హత లేదు: టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
రాష్ట్ర ప్రజలను మోసగిస్తున్న వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ కు దీక్ష చేసే అర్హత లేదని టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రత్యేక హోదా ఇచ్చేది రాష్ట్రం కాదు, కేంద్రమన్న విషయం జగన్ కు తెలియకపోతే తెలుసుకోవాలన్నారు. ఢిల్లీలో చేయాల్సిన దీక్షలు రాష్ట్రంలో చేస్తే ఏమి లాభమంటూ ఆయన ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీకి ఎనిమిది మంది ఎంపీలున్నారని, అటువంటప్పుడు జగన్ ఢిల్లీలో ఎందుకు దీక్ష చేయడం లేదని ఆయన అడిగారు. కేంద్ర కేబినెట్ నుంచి టీడీపీ పక్కకు తప్పుకుంటే, ఆ అవకాశాన్ని జగన్ అందిపుచ్చుకోవాలని చూస్తున్నారంటూ నరేంద్ర విమర్శించారు.