: ఏపీకి రండి: టీఎస్ టీడీపీ నేతలకు బాబు పిలుపు


ఈనెల 22న జరిగే నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపనకు రావాలని తెలంగాణ టీడీపీ నేతలను ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆహ్వానించారు. మొత్తం 9 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయని, దసరా నాడు శంకుస్థాపన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరుగుతుందని వెల్లడించిన ఆయన, తెలంగాణ కమిటీలోని ప్రతిఒక్కరినీ ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నామని, చరిత్రలో నిలిచిపోయేలా ఈ కార్యక్రమం ఉంటుందని ఆయన తెలిపారు. శంకుస్థాపనకు రావాలని భావించేవారు సాధ్యమైనంత ముందుగా నిర్వాహకులకు సమాచారం ఇస్తే, వసతి ఏర్పాట్లను చూసుకుంటారని చంద్రబాబు తెలిపారు.

  • Loading...

More Telugu News