: భోజనం చేస్తుంటే ముసుగు జారిందని కుమార్తెను కొట్టి చంపిన ముస్లిం ఛాందసుడు!


భోజనం చేస్తూ, మత విశ్వాసాలను పాటించడం లేదన్న కోపంతో తన ఐదేళ్ల కుమార్తెను కొట్టి చంపాడో దుర్మార్గుడు. కనీసం జాలి, దయ చూపకుండా చిన్నారిని హత్య చేసిన ఘటన యూపీలోని బరేలి సమీపంలోని ఓ గ్రామంలో సంచలనం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జాఫర్ హుస్సేన్ అనే వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టాడు. అన్నం తింటున్న సమయంలో కూతురు ముఖానికి ఉన్న ముసుగు (దుపట్టా) జారిపోయింది. ఇది ముస్లిం మత విశ్వాసాలకు వ్యతిరేకమని, ఘోర తప్పిదమని భావించిన జాఫర్, కోపంతో తన కూతురిని దారుణంగా కొట్టి, పాప తలను నేలకేసి బాదాడు. దీంతో ఆ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కూతురి ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నించిన భార్యను సైతం జాఫర్ వదిలిపెట్టలేదు. జరిగిన విషయం బయటకు రాకుండా చూసేందుకు ఆ పాపను ఇంట్లోనే ఖననం చేయాలని ప్రయత్నించాడు. భర్త చేసిన దారుణంపై ఆమె ఫిర్యాదు ఇవ్వగా పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి విచారిస్తున్నారు.

  • Loading...

More Telugu News