: విశాఖలో ప్రారంభమైన 'ప్రాజెక్ట్ అదితి'... లక్ష్యమిదే!
విశాఖపట్నంలో ప్రమాదవశాత్తు డ్రైనేజీలో పడి ప్రాణాలు కోల్పోయిన చిన్నారి అదితి పేరిట 'ప్రాజెక్ట్ అదితి' ప్రారంభమైంది. ఈ ఉదయం ఆర్కే బీచ్ వద్ద అదితికి నివాళిగా జరిగిన ఓ కార్యక్రమంలో ఈ ప్రాజెక్టును చిన్నారి కుటుంబ సభ్యులు, బంధువులు ప్రారంభించారు. అదితికి జరిగిన అన్యాయం మరెవరికీ జరగకూడదని ఈ ప్రాజెక్టును ప్రారంభించినట్టు వారు తెలిపారు. నగర ప్రజల నుంచి సలహాలు, సూచనలు, ఫిర్యాదులు తీసుకుని, వాటిని సంబంధిత ప్రభుత్వ శాఖలకు తక్షణమే తెలియజేసి, వాటిని పరిష్కరించడమే ప్రాజెక్టు లక్ష్యమని వివరించారు. ప్రాజెక్టు అదితి గురించి విశాఖ ప్రజల్లో అవగాహన తెచ్చేందుకు పాదయాత్ర నిర్వహించగా, పెద్దఎత్తున చిన్నారులు, ప్రజలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.