: 8 గంటల పనితో అధిక గుండెజబ్బులట... పనివేళలను 6 గంటలకు కుదించిన దేశమిదే!


ఆఫీసుల్లో 8 గంటల పనివేళల కారణంగా 33 శాతం మంది గుండె జబ్బులతో బాధపడుతున్నారట. ఈ విషయాన్ని ఓ అధ్యయనం ద్వారా గుర్తించిన స్వీడన్ దేశం తమ దేశంలోని ఆరు లక్షల మందికి పైగా ఉద్యోగుల పనివేళలను 6 గంటలకు కుదించింది. తక్కువ పనిగంటల తరువాత నాణ్యతా పరంగా, ఉత్పత్తి పరంగా ఏ విధమైన తేడా కనిపించలేదని, తక్కువ పని గంటలతో ఎక్కువ ప్రయోజనాలను తాము చూశామని స్వీడన్ ప్రకటించింది. మిగిలిన రెండు గంటలను కుటుంబంతో గడిపేందుకు, వ్యాయామం చేసేందుకు కేటాయించడం వల్ల ఉద్యోగుల్లో ఉత్పత్తి సామర్థ్యం పెరిగిందని, వారు వినూత్నంగా ఆలోచించడమూ ప్రారంభించారని ఈ అధ్యయనంలో వెల్లడైంది. తక్కువ పనివేళలు అమలు చేస్తున్న తరువాత, ఆఫీసుల్లో సోషల్ మీడియాలో గడపడం తగ్గిందని కూడా ప్రభుత్వం గుర్తించింది. స్వీడన్ లోని నర్సులపై తొలుత పనిగంటల తగ్గింపు ప్రయోగం చేయగా, వారు రోగులపై చిరాకు పడటం తగ్గిందని, శ్రద్ధగానూ పనిచేస్తున్నట్టు గుర్తించామని, దీంతో ఇతర ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో ఇదే విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించామని ప్రభుత్వం వెల్లడించింది. స్వీడన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అందరు ఉద్యోగులూ స్వాగతించారు. ఇక మిగతా దేశాల్లో ఆరు గంటల పనితీరు ఎప్పుడు అమల్లోకి వస్తుందో!

  • Loading...

More Telugu News