: నక్లెస్ రోడ్డులో సందడి చేసిన రామ్ చరణ్
ఈ ఉదయం హీరో రామ్ చరణ్ హైదరాబాదులోని నక్లెస్ రోడ్డులో సందడి చేశాడు. ప్రపంచ కంటి చూపు దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన 1కే రన్ లో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని దేవనార్ ఫౌండేషన్ ఏర్పాటు చేయగా, పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన అంధ విద్యార్థులు, కార్పొరేట్ కంపెనీల ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ ప్రసంగిస్తూ, ప్రతి ఒక్కరూ నేత్రదానం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ తరహా కార్యక్రమాల ద్వారా చూపులేని వారిలో మానసికంగా ధైర్యం పెరుగుతుందని అన్నారు. తమ అభిమాన హీరో రామ్ చరణ్ తో సెల్ఫీలు దిగేందుకు పలువురు పోటీ పడ్డారు.