: ఇండియాకు వ్యతిరేకంగా ఏకమైన నేపాల్ పార్టీలు!


నేపాల్ రాజ్యాంగ పునర్వ్యవస్థీకరణ విషయంలో భారత్ ప్రమేయాన్ని వ్యతిరేకిస్తూ, ఆ దేశంలోని మూడు ప్రధాన రాజకీయ పార్టీలూ గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకతాటిపైకి వచ్చాయి. నేపాల్ కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్, యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్, యూనిఫైడ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్-మావోయిస్టు పార్టీలు భారత ఆలోచనలను అడ్డుకునేందుకు ఒకే మాటకు వచ్చి నిలిచాయి. ఈ పార్టీలకు 601 మంది సభ్యులున్న నేపాల్ అసెంబ్లీలో పూర్తి మెజారిటీ ఉంది. కాగా, నేపాల్ లో నివసిస్తున్న మాధేయీల (మైథిలీ, భోజ్ పురి, అవధి, హిందీ, ఉర్దూ మాట్లాడే ప్రజలు) డిమాండ్లను పరిష్కరించే దిశగా రాజ్యాంగం మారాలన్నది భారత అభిమతం. కేవలం ఒక వర్గం ప్రజలను మాత్రమే వెనకేసుకొస్తున్న భారత్, నేపాల్ లోని ఇతరుల ప్రయోజనాలను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

  • Loading...

More Telugu News