: ఫైనల్ గా... 'గుడ్ బై గూగుల్'!


సెర్చింజన్ దిగ్గజం 'గూగుల్' పేరు అధికారికంగా 'ఆల్ఫాబెట్'గా మారిపోయింది. ఈ మేరకు సంస్థ ఒక ప్రకటన వెలువరించింది. గూగుల్ సంస్థను ఆల్ఫాబెట్ గా మార్చే ప్రక్రియ పూర్తయిందని, గూగుల్ కు మాతృసంస్థగా ఇకపై ఆల్ఫాబెట్ వ్యవహరిస్తుందని తెలిపింది. సోమవారం నుంచి అమెరికా స్టాక్ మార్కెట్ నాస్ డాక్ లో ఆల్ఫాబెట్ ఈక్విటీ వాటాల ట్రేడింగ్ ప్రారంభమవుతుందని స్పష్టం చేసింది. కాగా, గత ఆగస్టులో ఇంటర్నెట్ వ్యాపారంతో పాటు ఇతర సంస్థలైన రీసెర్చ్, టెక్నాలజీ కంపెనీలను 'ఆల్ఫాబెట్' పేరిట స్థాపించిన సంస్థ గొడుగు కిందకు తీసుకువస్తున్నామని గూగుల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇకపై సంస్థ ఆర్థిక ఫలితాలను సైతం విభాగాల వారీగా వెల్లడిస్తామని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లారీ పేజ్ వెల్లడించారు. సెర్చింజన్ సేవలు గూగుల్ పేరిట లభిస్తున్నప్పటికీ, సంస్థ కార్యాలయాల్లో గూగుల్ పేరున్న స్థానంలో ఇకపై ఆల్ఫాబెట్ అని కనిపించనుంది.

  • Loading...

More Telugu News