: ప్రేమికుడిని కలిసిందని చెల్లి గొంతు కోసిన అన్న


ఉత్తరప్రదేశ్ లో పరువు హత్య చోటుచేసుకుంది. మీరట్ సమీపంలోని సనుతా అనే గ్రామానికి చెందిన 17 ఏళ్ల ఉస్మాను ఆమె సోదరుడు అన్షు (20) గొంతుకోసి హత్య చేశాడు. అనంతరం స్వచ్ఛందంగా పోలీసులకు లొంగిపోయాడు. చెల్లి ప్రేమ వ్యవహారం కారణంగా పరువు పోతుందని భావించి సర్దానా గ్రామం నుంచి సనుతా గ్రామానికి వచ్చేశామని అన్షు తెలిపాడు. కుటుంబం తరలిపోయినా తన చెల్లి ప్రవర్తనలో మార్పు రాలేదని, నిన్న తన ప్రేమికుడిని కలిసిందని, అందుకే చంపేశానని అన్షు పోలీసులకు తెలిపాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, అన్షును అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News