: గుజరాత్ లో పటేళ్ల బాటలో బ్రాహ్మణులు


రిజర్వేషన్లు కావాలంటూ పటేళ్లు గుజరాత్ లో ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వారి బాటలో బ్రాహ్మణులు కూడా నడుస్తున్నారు. తమకు కూడా రిజర్వేషన్లు కల్పించాలంటూ గుజరాత్ బ్రాహ్మిణ్ సమాజ్ డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వోద్యోగాలు, విద్యా సంస్థల్లో సీట్లలో తమకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో విధులు నిర్వర్తిస్తున్న పూజారులకు ప్రతి నెలా జీతాలు చెల్లించాలని కోరింది. ఈ మేరకు వడోదరలో జరిగిన బ్రాహ్మిణ్ సమాజ్ సమావేశంలో నిర్ణయం తీసుకుందని వారు వివరించారు.

  • Loading...

More Telugu News