: ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసిన గ్రామస్థులు
శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం సిరుసువాడలో దారుణం చోటుచేసుకుంది. ప్రాథమికోన్నత పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు పాఠశాలలో చదువుతున్న బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో, ఆగ్రహానికి గురైన గ్రామస్థులు ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. అనంతరం ఆయనను పోలీసులకు అప్పగించారు. ఈ సందర్భంగా, బాలిక తల్లిదండ్రులు కొత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.