: హైదరాబాద్ లో ఇకపై ప్రతిరోజు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు
హైదరాబాద్ లో ఇక నుంచి ప్రతిరోజు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు జరగనున్నాయి. ఇంతవరకు నగరంలో వారాంతంలో మాత్రమే ఈ తనిఖీలు నిర్వహించే వారు. ఇవాళ నుంచి ట్రాఫిక్ పోలీసులు నగరంలో కొత్త నిబంధనను అమల్లోకి తీసుకొచ్చారు. ఇకపై ప్రతిరోజు మధ్యాహ్నం ప్రధాన కూడళ్లలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపడతామని తెలిపారు. ఈ మేరకు ఇవాళ నగరంలోని జూబ్లీహిల్స్ లో మధ్యాహ్నం ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.