: ఈ నెలాఖరున దక్షిణ కొరియా పర్యటనకు చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరో విదేశీ పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఈ నెల చివరివారంలో ఆయన దక్షిణకొరియా పర్యటనకు వెళుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ఈ పర్యటన ఉంటుందని తెలిసింది. అయితే పర్యటన ఎప్పటి నుంచి, ఎన్ని రోజులుంటుంది? అనే విషయాలు వెల్లడికావల్సి వుంది.