: అప్పటిదాకా సభను జరగనిచ్చే ప్రసక్తే లేదు: డీకే అరుణ
జల విధానంపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమవుతుండటంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డీకే అరుణ మండిపడ్డారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలపై ప్రజెంటేషన్ ఇవ్వాలని అన్నారు. ఈ ఏడాది కాలంలో రైతులు ఏ విధంగా ఆత్మహత్యలకు పాల్పడ్డారో అసెంబ్లీలో అందరం చూద్దామని చెప్పారు. రైతులకు ఒకేసారి రుణమాఫీ చేసేంతవరకు సభాకార్యక్రమాలను జరగనివ్వమని ఆమె స్పష్టం చేశారు. రైతు ఆత్మహత్యలపై ఉభయసభలను కలిపి సంయుక్త సమావేశాలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా, జల విధానంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం కోసం, ఇరు సభల సమావేశానికి అనుమతి ఇవ్వరాదని గవర్నర్ నరసింహన్ కు విజ్ఞప్తి చేశారు.