: వుహాన్ ఓపెన్ టైటిల్ కూడా సానియా-హింగస్ జోడీదే
టెన్నిస్ జోడీ సానియా మీర్జా-మార్టినా హింగస్ భాగస్వామ్య ఖాతాలో మరో టైటిల్ చేరింది. చైనాలో జరుగుతున్న వుహాన్ ఓపెన్ టైటిల్ ను ఈ జంట కైవసం చేసుకున్నారు. మహిళల డబుల్స్ పైనల్లో రుమేనియాకు చెందిన ఇరీనా కామెలియా బెగూ-మోనికా నికెలస్కూ జోడీపై 6-2, 6-3 తేడాతో విజయం సొంతం చేసుకుంది. ఈ గెలుపుతో ఈ సంవత్సరం సానియా-హింగస్ జోడీ ఏడవ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ ఏడాది వింబుల్డన్ నుంచి కొనసాగుతున్న వారిద్దరి విజయ పరంపర ఈ ఏడాదిలో అత్యుత్తమ జోడీగా పేరొందుతోంది.