: గల్లంతైన విమానం కోసం గాలింపు ముమ్మరం
తూర్పు ఇండోనేషియాలో ఏవియేస్టర్ మండిరి ప్రైవేట్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం నిన్న గల్లంతైంది. దక్షిణ సులవేసి ప్రావిన్స్ లోని మసాంబ నుంచి మకస్సార్ కు 10 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఈ విమానం... మరో 11 నిమిషాల్లో మకస్సార్ లో దిగాల్సి ఉంది. అంతలోనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో విమానానికి సంబంధాలు తెగిపోయాయి. వెంటనే రంగంలోకి దిగిన వైమానిక సిబ్బంది, గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం దక్కలేదు. దీంతో, ఉదయం విమాన ఆచూకీ కోసం గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేశారు. ఈ విషయాన్ని ఇండోనేషియా రవాణా మంత్రిత్వ శాఖ ప్రతినిధి జూలియస్ బారట వెల్లడించారు.