: బీహార్ ఎన్నికల్లో ‘కులం... బిగ్గెస్ట్ స్టార్’...ట్విట్టర్ లో లాలూ కామెంట్స్


బీహార్ లో అధికారమే లక్ష్యంగా బరిలోకి దిగిన బీజేపీకి ఝలక్కిచ్చేందుకు ఆర్జేడీ అధినేత, ఆ రాష్ట్ర మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ అందివచ్చిన ప్రతి అంశాన్ని అవకాశంగా మలచుకుంటున్నారు. మొన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, నిన్న ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీపై ఘాటు విమర్శలు గుప్పించిన లాలూ తాజాగా ‘కులం’ కార్డుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘బీహార్ ఎన్నికల్లో ‘కులం’ పెద్ద స్టారే. భారత్ లో కులాన్ని పక్కనబెట్టడం అసాధ్యమే. దేశంలో ఇది కాదనలేని నిజం’’ అని ఆయన ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు. ‘‘జంతువుల్లోనూ కులాలున్నాయి. ఏనుగుల్లోనూ కులాలున్నాయి. ఇదేమీ పాడు పదమేమీ కాదు’’ అని లాలూ తనదైన శైలిలో దూసుకుపోయారు. అగ్రవర్ణాలకు చెందిన బీజేపీ, అణగారిన వర్గాలకు చెందిన మహా కూటమి(జేడీయూ కూటమి) మధ్యే పోటీ జరుగుతోందన్న కోణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News