: లిబియాలో ఆయిల్ పోర్టుపై ఐఎస్ తీవ్రవాదుల దాడి


లిబియాలోని అతిపెద్ద ఆయిల్ పోర్ట్ సిడ్రాపై ఐఎస్ తీవ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ఓ సైనికుడు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారని మిలటరీ ఉన్నతాధికారి తెలిపారు. 2014 డిసెంబర్ నుంచి ఈ పోర్ట్ మూసివేసినట్టు వెల్లడించారు. ఐఎస్ తీవ్రవాదుల దాడికి వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది పోర్ట్ వద్ద కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు మరణించారని చెప్పారు. ఈ దాడికి ముందు తీవ్రవాదులు ట్రక్ బాంబును పేల్చారు.

  • Loading...

More Telugu News