: సాకర్ స్టార్ రొనాల్డిన్హోకు తృటిలో తప్పిన ప్రమాదం


ప్రపంచ ప్రఖ్యాత ఫుట్ బాల్ క్రీడాకారుడు రొనాల్డిన్హో (35)కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. అతను ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తు రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడిపోయింది. తన తల్లి అలిగ్రే జన్మదిన వేడుకల కోసం వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో రొనాల్డిన్హో డ్రైవర్ కారు నడుపుతున్నాడు. ఈ ప్రమాదం నుంచి రొనాల్డిన్హో క్షేమంగా బయటపడటంతో, అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బ్రెజిల్ ఆటగాడైన రొనాల్డిన్హో రెండుసార్లు ఫిఫా ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నాడు. గోల్ పోస్ట్ పై మెరుపు దాడులు చేయడంలో అతను దిట్ట.

  • Loading...

More Telugu News