: ముంబై పోలీసు ప్రధాన కార్యాలయంపై ఆత్మాహుతి దాడి చేస్తా: సిరియా నుంచి తిరిగొచ్చిన యువకుడు
ముంబై పోలీసు ప్రధాన కార్యాలయం మీద ఆత్మాహుతి దాడి చేస్తానంటూ ఓ యువకుడు చేసిన ట్వీట్ తో పోలీసులు అలర్ట్ అయ్యారు. కళ్యాణ్ ప్రాంతానికి చెందిన అరీబ్ మజీద్ అనే యువకుడు తన స్నేహితుడు ఫహీద్ షేక్ తో కలసి ఏడాది క్రితం సిరియా వెళ్లాడు. ఐఎస్ఐఎస్ లో చేరేందుకే వీరు సిరియా వెళ్లారు. ఈ ట్వీట్ ను పోస్ట్ చేసిన ట్విట్టర్ అకౌంట్ ను ఫహీద్ షేకే నిర్వహించేవాడని తెలుస్తోంది. మజీద్ సోదరిని పోలీసులు తీవ్రంగా అవమానించారని, అందుకే వాళ్ల మీద ప్రతీకారం తీర్చుకోవడానికి పోలీసు ప్రధాన కార్యాలయం మీద దాడి చేయడానికి సిద్ధమయ్యాడని చెబుతున్నారు. ఐఎస్ లో మజీద్ సివిల్ ఇంజినీర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడని కూడా ట్వీట్ లో ఉంది. ఉగ్రవాద చర్యలకు చెందిన ట్వీట్ ను పోస్ట్ చేయడంతో, ఆ ఖాతాను ట్విట్టర్ వెంటనే సస్పెండ్ చేసింది.