: తిరుమలకు పోటెత్తిన భక్తజనం... వీఐపీ దర్శనాల నిలిపివేత


తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం భక్తజనంతో పోటెత్తుతోంది. వరుస సెలవు దినాలు రావడంతో నిన్నటి నుంచే తిరుమలకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. దీంతో ప్రస్తుతం తిరుమల కొండ భక్తజనంతో కిటకిటలాడుతోంది. సాధారణ భక్తులకు ఇబ్బందులను తప్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వీఐపీ బ్రేక్ దర్శనాలను నిలిపివేసింది. అయితే ప్రొటోకాల్ పరిధిలో ఉన్న వీఐపీలకు మాత్రం బ్రేక్ దర్శనాన్ని కల్పిస్తోంది. భక్తుల రద్దీ కారణంగా సర్వదర్శనం భక్తులకు స్వామి వారి దర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. కాలిబాట భక్తులకు 11 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం కొండపై వసతి సౌకర్యాలు లభించక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.

  • Loading...

More Telugu News