: ఇంద్రాణి పరిస్థితి విషమం


షీనాబోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు, తల్లి ఇంద్రాణి ముఖర్జియాను ముంబయి జేజే ఆసుపత్రికి తరలించారు. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ఆమె శుక్రవారం మధ్యాహ్నం నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈరోజు మధ్యాహ్నం నుంచి ఆమె కోమాలోనే ఉన్నట్లు వైద్యులు చెప్పారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని మరో 24 గంటలు గడిస్తేకానీ ఏమీ చెప్పలేమని జేజే ఆసుపత్రి డీన్ లహానే చెప్పారు.

  • Loading...

More Telugu News