: ఆ ఇద్దరి పొత్తు ఎక్కువ కాలం నిలవదు: రాజ్ నాథ్ సింగ్


జేడీ(యు) అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ల పొత్తు ఎక్కువ కాలం నిలబడదని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ జోస్యం చెప్పారు. బీహార్ లోని జముయ్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి విజయ ఢంకా మోగిస్తుందన్న భయంతోనే వారిద్దరూ కూటమిగా ఏర్పడ్డారని అన్నారు. రిజర్వేషన్లను రద్దు చేసే సమస్యే లేదని, లౌకిక కూటమి అనవసరమైన వివాదాలు సృష్టించడానికి ప్రయత్నిస్తోందని రాజ్ నాథ్ ఆరోపించారు.

  • Loading...

More Telugu News