: రామ్ చరణ్ తో పని చేయడం చాలా బావుంది: కృతి కర్బందా


రామ్ చరణ్ తో పని చేయడం చాలా బావుందని నటి కృతి కర్బందా తెలిపింది. నోవాటెల్ లో జరుగుతున్న 'బ్రూస్ లీ ద ఫైటర్' సినిమా ఆడియో వేడుకలో ఆమె మాట్లాడుతూ, సినిమాలో ప్రత్యేక పాత్రలో నటించడం బావుందని తెలిపింది. ఈ పాత్రలో నటించే అవకాశమిచ్చిన నిర్మాత దానయ్య, దర్శకుడు శ్రీను వైట్లకు ధన్యవాదాలు చెప్పింది. తమన్ అద్భుతమైన సంగీతం అందించాడని కృతి చెప్పింది. ఈ సినిమా అభిమానులను అలరిస్తుందని, ఇది అభిమానులకు పండగలాంటిదని కృతి తెలిపింది.

  • Loading...

More Telugu News