: పీటీపీ సంస్థకు నటుడు కమల్ హాసన్ భారీ విరాళం


సహజనటుడు కమల్ హాసన్ ఒక సంస్థకు భారీ మొత్తంలో విరాళాన్ని అందజేసి తన మానవత్వాన్ని చాటుకున్నారు. హెచ్ఐవీ బాధితుల సహాయార్థం పనిచేస్తున్న పీటీపీ సంస్థకు రూ.16 కోట్ల విరాళాన్ని కమల్ అందజేశారు. ఈ సంస్థ హెచ్ఐవీతో బాధపడుతున్న చిన్నారులకు వైద్య బీమా అందిస్తోంది. కమల్, హల్లో ఎఫ్ఎం రేడియో భాగస్వామ్యంతో నడుపుతున్న ఈ సంస్థను 2011లో స్థాపించారు. కమల్ హాసన్ ఇంత భారీ మొత్తంలో విరాళం ఇవ్వడంతో, రీల్ లైఫ్ లోనే కాదు, రియల్ లైఫ్ లోనూ ఆయన హీరో అనిపించుకున్నారంటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

  • Loading...

More Telugu News