: ఇండోనేసియా విమానం గల్లంతు


ఇండోనేషియాలోని సులావెసీ ప్రావిన్స్ లో ప్రయాణికులతో వెళ్తున్న విమానం గల్లంతైంది. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... అవియా స్టార్ మందిరి అనే ప్రైవేటు విమానయాన సంస్థకు చెందిన డీహెచ్ సీ 6 ట్విన్ ఒట్టర్ విమానం మసంబా నుంచి మకస్సార్ బయల్దేరింది. మరో అరగంటలో మకస్సార్ విమానాశ్రయం చేరుకుంటుందనగా సులావెసీ ప్రావిన్స్ లో విమానంతో సంబంధాలు తెగిపోయాయి. ఈ సమయంలో విమానంలో ముగ్గురు సిబ్బంది, ఏడుగురు ప్రయాణికులు ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ విమానం కోసం గాలింపు చేపట్టినట్టు అధికారులు చెప్పారు.

  • Loading...

More Telugu News